Electoral Bonds Case: ఎలక్టోరల్ బాండ్ కేసుకు సంబంధించి శుక్రవారం (మార్చి 15, 2024) సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో 2019 సంవత్సరానికి ముందు రాజకీయ పార్టీల నుండి వచ్చిన విరాళాల సమాచారాన్ని సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు అందించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
జూన్ 30 వరకు గడువును పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు ఎస్‌బీఐకి మార్చి 12 వరకు అంటే రేపటి వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.
ఎన్నికల బాండ్లవివరాల వెల్లడికి ఎస్బీఐ అదనపు సమయం కోరడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఎన్నికల కమిషన్‌కు అన్ని ఎలక్టోరల్ బాండ్ లావాదేవీల వివరాలను అందించడానికి అదనపు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
Arun Goel: లోక్సభ ఎన్నికలకు కొన్ని వారాల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామానాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం భారమంతా ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది. లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఆయన రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం అరుణ్ గోయెల్ లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో క్రియాశీలకంగా ఉన్నారు.
Election Commission: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు మర్యాదపూర్వకంగా, ఉత్తమంగా నడుచుకోవాలని సలహా ఇచ్చింది. బహిరంగ సభల్లో సంయమనం పాటించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా ఉండాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్(ఎంసీసీ) ఉల్లంఘన విషయంలో పార్టీలు సీరియస్‌గా ఉండాలని చెప్పింది. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
West Bengal : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ బృందం మొత్తం ఇంకా పశ్చిమ బెంగాల్‌కు చేరుకోలేదు. అయితే ఎన్నికలకు ముందు హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున మార్చి 1 నుండి పశ్చిమ బెంగాల్లో 100 కంపెనీల సెంట్రల్ ఫోర్స్‌ని మోహరిస్తారు.
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ స్పీడ్‌ని పెంచాయి. ఏ క్షణానైనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, మార్చి 13 తర్వాత ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతను అంచనా వేయడానికి ఎలక్షన్ కమిషన్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తోందని, అది…