US-Pakistan: ఉగ్రవాద దేశానికి అమెరికా మద్దతు తెలుపుతోంది. యూఎస్ పాకిస్తాన్ సంబంధాలు నానాటికి బలపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశ ప్రయోజనాల కన్నా, సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పాకిస్తాన్‌తో జతకట్టి భారత వ్యతిరేక పనుల్ని చేస్తున్నాడు.
ట్రంప్ టారిఫ్స్ బాంబులను పేల్చుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఇంపోర్టెడ్ ట్రక్కులపై సుంకాలను ప్రకటించాడు. మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% సుంకాన్ని ప్రకటించారు. ఈ సుంకం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అయితే మొదట దీనిని అక్టోబర్ 1 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. పరిశ్రమ వర్గాలు ఖర్చులు, సప్లై చైన్, పోటీ గురించి ఆందోళనలు వ్యక్తం చేసిన తర్వాత గడువును వాయిదా వేశారు. సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని పంచుకుంటూ, అమెరికాకు…
Pakistan: అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో…
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లపై ప్రశంసలు కురిపించారు. సోమవారం వైట్ హౌస్ ప్రెస్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఇద్దరు పాకిస్తాన్ నేతలు ‘‘అద్భుతమైనవారు’’గా కొనియాడారు. గాజా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రతిపాదించిన 20-పాయింట్ల ప్రణాళికకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందని,వీరిద్దరు పూర్తి మద్దతు ఇస్తోందని ట్రంప్ అన్నారు. Read Also: Odisha: గోడ దూకి ప్రియురాలి ఇంట్లోకి ప్రవేశించిన ప్రియుడు.. విద్యుత్ షాక్…
H-1B visa: H-1B వీసా ఫీజును పెంచుతూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు(రూ. 88లక్షలు) ఫీజు విధించాడు. ముఖ్యంగా, దీని ప్రభావం భారతీయ టెక్కీలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే, మొత్తం హెచ్1బీ వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. అయితే, హెచ్1బీ వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది.
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచడం చివరకు భారత్‌కే ప్రయోజనకరంగా మారబోతోంది. కొత్త హెచ్1బీ వీసా దరఖాస్తుదారులకు లక్ష డాలర్లు (రూ. 88 లక్షలు) ఫీజు విధించారు. దీంతో, అమెరికన్ కంపెనీలు తమ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించేందుకు ఆలోచిస్తున్నాయి. భారతదేశ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs) కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో యూఎస్ లోని చాలా సంస్థలు తమ పనిని భారత్‌కు తరలించాలని చూస్తున్నాయి. Read Also: Pakistan: క్వెట్టాలో…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల…
India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.