అగ్ర రాజ్యం అమెరికాలో క్రిస్మస్ సమయంలో ఎప్‌స్టీన్ ఫైల్స్ విడుదల కాకరేపుతోంది. గత వారం కొన్ని ఫైల్స్ విడుదల చేసిన న్యాయశాఖ.. తాజాగా మరో కొన్ని పత్రాలను విడుదల చేసింది. అయితే ఈ కొత్త ఫైల్స్‌లో అధ్యక్షుడు ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను మాత్రం న్యాయశాఖ తోసిపుచ్చుతోంది.
ఇది కూడా చదవండి: Turkey: టర్కీలో విమాన ప్రమాదం.. లిబియా ఆర్మీ చీఫ్ దుర్మరణం
న్యాయశాఖ సెన్సార్ చేయని కొత్త ఫైల్‌లో ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ ఒక మహిళను అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ 2020 నాటి ఎఫ్‌బీఐ ఇన్‌టేక్ ఫారమ్ బహిర్గతం అయింది. ట్రంప్ అత్యాచారం చేశాడని.. ఎప్‌స్టీన్‌తో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ఫైల్‌లో పేర్కొనబడి ఉంది. ఒక మహిళ చేసిన ఆరోపణ పొందపరచబడింది. 1997లో హై-ఎండ్ హోటల్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆరోపణలు చేసిన మహిళ వయసు, గుర్తింపు అస్పష్టంగా కనిపించింది. దీనిపై సరైన దర్యాప్తు జరగలేనట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఈ-మెయిల్..
ఇక 1990లో ట్రంప్-ఎప్‌స్టీన్‌తో జెట్ రైడ్‌లు చేశారని.. 1993-1996 మధ్య ఎనిమిది ట్రిప్పులు చేసినట్లుగా విమాన లాగ్‌లు ధృవీకరించాయి. ఇక గుర్తు తెలియని ఫెడరల్ ప్రాసిక్యూటర్ నుంచి వచ్చిన ఈ-మెయిల్ ఆధారంగా 1995లో ట్రంప్‌ను ఒక డ్రైవర్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడని.. ట్రంప్ పదే పదే ‘జెఫ్రీ’ అని ఉచ్చరించాడని.. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్లుగా ఒక ఫోన్ కాల్‌ను డ్రైవర్ విన్నాడని పేర్కొ్న్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళను డ్రైవర్ తర్వాత కలుసుకున్నాడని.. తీరా చూస్తే డ్రైవర్ జనవరి, 2000లో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫైల్‌కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

తాజాగా మంగళవారం దాదాపు 30,000 పత్రాలను న్యాయశాఖ విడుదల చేసింది. రాబోయే వారాల్లో లక్షలాది పత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ట్రంప్‌పై వస్తున్న అత్యాచార ఆరోపణలను న్యాయశాఖతో పాటు ట్రంప్ వర్గం తీవ్రంగా ఖండిస్తోంది. ట్రంప్‌ను అధికారికంగా ఎప్పుడూ విచారించలేదని.. అత్యాచార ఆరోపణలు అవాస్తం అని న్యాయశాఖ పేర్కొంది.

The Department of Justice has officially released nearly 30,000 more pages of documents related to Jeffrey Epstein.
Some of these documents contain untrue and sensationalist claims made against President Trump that were submitted to the FBI right before the 2020 election. To be…
— U.S. Department of Justice (@TheJusticeDept) December 23, 2025