US Travel Ban: 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్!
- 30 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన డొనాల్డ్ ట్రంప్..
- 15 దేశాలకు చెందిన పౌరులపై పాక్షిక ఆంక్షలు విధించిన యూఎస్..
- డొనాల్డ్ ట్రంప్ ప్రయాణ విధానంపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Travel Ban: ప్రభుత్వం ప్రయాణ నిషేధాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. తాజాగా మరో ఐదు దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని అమలు చేయడంతో.. పాలస్తీనా అథారిటీ జారీ చేసిన పత్రాలతో ప్రయాణించే వారికి పూర్తిగా ప్రవేశంపై బ్యాన్ విధించింది. అలాగే, మరో 15 దేశాల పౌరులపై పాక్షిక పరిమితులు విధించింది. ఇప్పటి వరకు మొత్తం 30కి పైగా దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది.
Read Also: Egg Quality : ఆడవారిలో అండాల నాణ్యత పెంచే అద్భుతమైన ఆహారాలు!
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రవేశ ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. కొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై సరైన సమాచారం లేకపోవడం వల్ల భద్రతాపరమైన ముప్పు ఉందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జూన్‌లో ట్రంప్ ప్రభుత్వం 12 దేశాల పౌరులకు యూఎస్ ప్రవేశంపై నిషేధం విధించింది. అదే సమయంలో మరో ఏడు దేశాలపై కఠినమైన వీసా, స్క్రీనింగ్ పరిమితులు అమలు చేసింది. ఆ జాబితాలో అఫ్గానిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో రిపబ్లిక్, ఈక్వేటోరియల్ గినియా, ఎరిట్రియా, హైటి, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా దేశాలపై పాక్షిక ఆంక్షలను విధించారు.
Read Also: Boyapati Srinu: నా భయం అంతా అభిమానుల గురించే!
కొత్తగా పూర్తిస్థాయి నిషేధంలోకి వచ్చిన దేశాలు
తాజాగా, బుర్కినా ఫాసో, మాలి, నైజర్, దక్షిణ సుడాన్, సిరియా దేశాల పౌరులపై పూర్తిస్థాయి ప్రయాణ నిషేధాన్ని విస్తరించింది. దీని వల్ల ఆయా దేశాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రత్యేక అనుమతులు ఇస్తామని యూఎస్ అధికారులు తెలిపారు. ఈ దేశాల్లో అవినీతి, నకిలీ పౌర పత్రాలు, సరైన క్రిమినల్ రికార్డుల వంటి అంశాలు అమెరికా భద్రతా తనిఖీలను బలహీనపరుస్తున్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. అలాగే, వీసా గడువు ముగిసిన తరువాత కూడా అమెరికాలోనే ఉండిపోవడం, తమ పౌరులను తిరిగి తీసుకెళ్లకపోవడంలో ప్రభుత్వాలు సహకరించకపోవడం లాంటి కారణాలనూ ప్రస్తావించింది.
ఇక, ఈ నిర్ణయాలతో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయాణ విధానం మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. భద్రత పేరుతో తీసుకున్న ఈ చర్యలు మానవ హక్కులు, వలస విధానాలపై ప్రభావం చూపనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!