Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
Read Also: 55dB ANC, డ్యూయల్ డ్రైవర్స్, AI ట్రాన్స్‌లేషన్ ఫీచర్లతో కొత్త Realme Buds Air 8 లాంచ్..!
ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో 27 ప్రావిన్సుల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి అమెరికా ప్లాన్ చేస్తున్నట్లు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. జెరూసలెం పోస్ట్‌లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. అమెరికా, ఇజ్రాయిల్ అధికారులు కలిసి ఇరాన్‌పై ఏం చేయాలనే మార్గాలను అన్వేషిస్తున్నాయని చెప్పింది.
2022లో మహ్సా అమిని ‘‘హిజాబ్’’ హత్య తర్వాత మరోసారి ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రియాల్ దారుణంగా పడిపోవడంతో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. దీంతో ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఆందోళన రూపంలో బయటకు వచ్చాయి. ఈ ఆందోళనల్లో ఇరాన్ అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. మరోవైపు, ఈ అల్లర్లను అణిచివేసేందుకు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.