కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు.
Cows trample people in Madhya Pradesh’s Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వింత సంప్రదాయం కొనసాగవుతోంది. భక్తులు నేలపై పడుకొని ఆవులతో (గోవులు) తొక్కించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గోవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు అంటున్నారు. తాజాగా భక్తులపై నుంచి ఆవులు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని…
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.
బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సహజ స్వరూపం కూడా ఇదే.. సింహవాహనాన్ని అధిష్ఠించి, ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా కనకదుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. అయితే, అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మహిషాసుర మర్ధిని అవతారంలో, 2 గంటల నుంచీ రాజరాజేశ్వరీ దేవి అవతారంలోనూ దర్శనం ఇస్తారు.