ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటిరోజు విజయవంతం చేశారు.
Read Also: Telangana CS Shanti Kumari: కనకదుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి
కోటి దీపోత్సోవంలో మొదటి రోజులో భాగంగా.. దీప యజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత.. సమస్త పుణ్య నదుల జలాలతో కాశీస్పటిక లింగానికి సహస్రకలశాభిషేకం చేశారు. అంతేకాకుండా.. భక్తులతో కోటిమల్లెల అర్చన కార్యక్రమం నిర్వహించారు. శ్రీశైలం శ్రీభ్రమరాంబమల్లికార్జునుల కల్యాణం కూడా జరిపించారు. ఆ తర్వాత హంసవాహనంపై ఆదిదంపతుల దర్శనం భక్తులకు కల్పించారు. సూత్తూరు శ్రీక్షేత్ర మఠాధిపతి శ్రీశివరాత్రిదేశికేంద్ర మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. శ్రీబాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి ప్రవచనామృతం నిర్వహించారు. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో మొదటి రోజు కోటి దీపోత్సవం వేడుక విజయవతంగా ముగిసింది.
Read Also: Rakshit Shetty: ఆమెను ఎంతో ప్రేమించా.. కానీ, వాడు ఆ పని చేసి..
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నంచి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. చూడటానికి ఎంతో అందంగా అద్భుతంగా అనిపించింది. మరోవైపు భక్తి టీవీ కోటిదీపోత్సవంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచనా టెలివిజన్ పక్షాన పూర్తి ఉచితంగా అందించింది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా భక్తి టీవీ ఈ దీప మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ వస్తుంది.. ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కోటిదీపోత్సవం జరగనుంది.. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ మహాశివుడి అనుగ్రహం పొందాలని భక్తి టీవీ ఆహ్వానం పలుకుతోంది.