అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత 'ఆస్తా' పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. భక్తుల డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు.…
అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాగా.. బుధవారం తొలిసారిగా రామయ్య భక్తులకు దర్శనమిచ్చాడు. డప్పు, వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. కాగా.. గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ క్రమంలో.. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు.
శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రసాదానికి కొరత ఏర్పాడింది. శబరిమల ప్రసాదాన్ని ప్రత్యేక డబ్బాలలో ఇస్తారు.. అయితే, ఇప్పుడు ఆ డబ్బాలకు కొరత ఏర్పడింతో.. ప్రసాదంపై ట్రావెన్ కోర్ దేవస్థాన్ బోర్డు ఆంక్షలు విధించింది.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు.
Huge Rush At Yadadri Temple: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి 2 గంటల సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అధ్యయనోత్సవ భాగంగా నేడు మూడవ…
Huge Rush At Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తులు పోటెత్తారు. సోమవారం, అందులోనూ సెలవు దినాలు కావడంతో స్వామి వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. రాజరాజేశ్వరుడిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. ప్రస్తుతం క్యూలైన్లు కిక్కిరిసిపోవడంతో స్వామివారి దర్శనానికి ఏకంగా 8 గంటల సమయం పడుతోంది. Also Read: Suresh Raina: లక్నో సూపర్ జెయింట్స్‌లోకి సురేష్ రైనా! గత నెల రోజులుగా రాజన్న…
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారు జాము నుంచే స్వామివారి దర్శనం కోసం ఆలయాల దగ్గర భక్తులు బారులు తీరారు.
తిరుమల తిరుపతిలో రేపు సర్వ దర్శనం భక్తులకు జారి చేసే టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. ఇక, రేపు మధ్యహ్నం నుంచి సర్వ దర్శనం భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు జారీ చేయనుంది.