తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, బ్రహ్మోత్సవాల్లో నేటి ఉదయం 3 గంటల నుంచి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకతో పాటు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించారు.
Read Also: Operation Ajay: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి ఇండియన్స్ ..
ఇక, చక్రతాళ్వార్‌కీ అర్చకులు పుష్కరిణిలో అవబృద్ద స్నానం అర్చకులు చేయించారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ (సోమవారం) రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి చక్రస్నాన మహోత్సవాన్ని తిలకించేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, టీటీడీ ముద్రించిన 6 పేజీల ప్రత్యేక కేలండర్‌ను చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి అశ్వ వాహనం ఎదుట ఆవిష్కరించారు. 450 రూపాయల విలువైన ఈ కేలండర్‌ను 50 వేల కాపీలను టీటీడీ తయారు చేయించింది.