ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై స్టార్ట్ అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు కనిపించనున్నారు. తెల్లవారు జాము నుంచే అమ్మవారికి స్వపనాభిషికం, ప్రత్యేక అలంకరణ చేసేశారు. దీంతో తొలి రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి దర్శనం కోసం దాదాపు 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక, స్వామివారి దర్శనానికి టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది.
శుక్రవారం తిరుమల అలిపిరి నడకదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా.. మూడేళ్ల చిన్నారి లక్షితను చిరుత ఎత్తుకెళ్లి బలి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు.
కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోడానికి తెల్లవారు జామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల పండగా సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మితం కానున్న రామాలయం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం కలగనుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. మహాద్వారం వద్ద స్వామివారి హుండీ పడిపోయింది. ఆలయం నుంచి శ్రీవారి హుండీని లారీలో పరకామణి మండపానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
సింహాచల పుణ్యక్షేత్రం గిరిప్రదక్షిణలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం ప్రారంభమైన గిరిప్రదక్షిణలు.. సోమవారం కూడా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో గిరిప్రదక్షిణలు జరుగుతూ ఉన్నాయి.
జయవాడ దుర్గగుడి పాలకమండలి ఇవాళ సమావేశమైంది. అందులో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. దేవస్ధానంలో NMR లుగా పదుల సంవత్సరాలుగా కొనసాగుతున్న వారిని పర్మినెంట్ చేయాలని నిర్ణయించామన్నారు. మొత్తం 50 మంది NMR లు దుర్గ గుడిలో పని చేస్తున్నారని.. 50 శాశ్వత ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చైర్మన్ పేర్కొన్నారు.