కార్తీక మాసం సందర్భంగా భక్తులు శివాలయాల్లో విశిష్ట పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో కొలువైన శ్రీ రాజ రాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా రాజన్న ఆలయంలో కళ్యాణం అర్జిత సేవ టికెట్ల కోసం భక్తులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వామి వారి నిత్య కళ్యాణం కోసం భక్తులు అర్ధరాత్రి నుండే టికెట్ కౌంటర్ వద్ద ఎముకలు కొరికే చచలిలో పడిగాపులు కాస్తున్నారు. మూడు రోజులుగా…
Srisailam Temple: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శ్రీశైలం దేవస్థానంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం తరలివచ్చారు. పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ, కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామ స్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి…
Deputy CM Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తమైంది.. వివిధ ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టింది.. కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
Tirumala Rush: తిరుమలలోని శ్రీనివాసుడి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సన్నిధికి వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
Simhadri Appanna: విశాఖపట్నంలోని సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు పెను ప్రమాదం తప్పింది. గిరి ప్రదక్షిణ మార్గంలో తొలి పావాంచా దగ్గర నిర్మించిన రేకుల షెడ్ కూలిపోయింది. షెడ్ కింద కాంక్రీట్ బేస్ లేకపోవడం, బరువు అధికంగా ఉండటంతో, షెడ్ కిందకి కుప్పకూలింది.
శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త. ఈరోజు నుంచి మల్లన్న స్పర్శ దర్శనం తిరిగి ప్రారంభం కానుంది. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోవాలి. Also Read: AP Liquor Scam: కాలమే…
తిరుమల శ్రీవారి గర్భాలయంలో అడుగుపెట్టి భక్తిపారవశ్యంలో మునిగితేలుతారు.. ఇప్పుడు శ్రీవారి గర్భాలయం నమూనాతో నాన్వెజ్ హోటల్ పెట్టడంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయితే, తాము శ్రీవారిపై భక్తితోనే ఏర్పాటు చేశాం అంటున్నారు నిర్వాహకులు
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గ అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించే ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.