Cows trample people in Madhya Pradesh’s Ujjain: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వింత సంప్రదాయం కొనసాగవుతోంది. భక్తులు నేలపై పడుకొని ఆవులతో (గోవులు) తొక్కించుకుంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు.. గోవులతో తొక్కించుకోవడం వల్ల తమ కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని, అందుకే వాటితో తొక్కించుటామని భక్తులు అంటున్నారు. తాజాగా భక్తులపై నుంచి ఆవులు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని భిదద్వాడ్ గ్రామంలో దీపావళి తర్వాతి రోజున గోవర్ధన్ పూజ చేయడం వారి సంప్రదాయం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది వందలాది మంది పురుషులు ఈ సంప్రదాయంలో పాల్గొంటారు. గోవర్ధన్ పూజలో పాల్గొనే భక్తులు ముందుగా ఐదు రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఆలయంలోనే ఉండి భజన-కీర్తనలు చేస్తారు. చివరి రోజున నేలపై పడుకుని ఆవులతో తొక్కించుకుంటారు.
2023 దీపావళి సందర్భంగా పండగ తర్వాతి రోజు ఉదయం గ్రామస్థులు గోవులకు పూజలు చేసారు. ఆ తర్వాత అన్నింటినీ ఒకే చోటకు తీసుకొచ్చారు. వాయిద్యాలు, డప్పులతో భక్తులు గ్రామమంతా ప్రదక్షిణలు చేశారు. అనంతరం పురుషులు నేలపై పడుకుని.. గోవులతో తొక్కించుకున్నారు. తల్లి ఆవు ఎవరికీ హాని చేయదని వారు నమ్ముతారు. అబద్ధం చెప్పేవారి పైనుంచి ఆవులు నడుస్తాయని అక్కడి వారి నమ్మకం. ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని అక్కడి భక్తులు అంటున్నారు.