తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి తిరుపతిలో జారీచేసే సర్వదర్శన టోకెన్లు రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఎల్లుండి మధ్యహ్నం 2 గంటల నుంచి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు కేటాయించనుంది టీటీడీ.. తిరుపతిలో 9 కేంద్రాల వద్ద 94 కౌంటర్లు ద్వారా టికెట్లు జారీ చేయనున్నారు అధికారులు.. రోజుకి 42,500 చొప్పున మొత్తం 4.25 లక్షల టికెట్లను వైకుంఠ ద్వారా దర్శనం కోసం కేటాయించింది టీటీడీ..
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది.. గత రెండు రోజుల నుంచి భక్తులు తిరుమల కొండకు భారీ సంఖ్యలో వెళ్తున్నారు. డిసెంబర్ లో సెలవులు రావడంతో చివరి రెండు వారాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. కాగా, నిన్న శ్రీనివాసుడిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు.
Sabarimala: శబరిమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కేరళ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తడంతో స్వామివారి దర్శనంలో జాప్యం జరుగుతోంది.
Sabarimala : ప్రస్తుతం కేరళలోని శబరిమల ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొంతమంది యాత్రికులు దర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
Huge Devotees in Srisailam Temple on the occasion of Karthika Masam 2023: కార్తికమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తిక దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోతుంది. కార్తికమాసం, అందులోనూ సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం…
కార్తికమాసంలో తొలి సోమవారం ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని చెబుతారు.. ఈ సందర్భంగా గోదావరి నది భక్తులతో కిటకిటలాడుతోంది.. కార్తిక మాసంలో మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలో స్నానఘట్టాలు భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నాయి.
ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం మొదటిరోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కేరళలోని శబరిమల క్షేత్రంలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి.. నవంబర్ 17 (శుక్రవారం) నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది శబరిమల వార్షిక వేడకలకు సిద్ధమైంది. నవంబర్ 17 నుంచి మండల మకరవిళక్కు వేడుకలు ప్రారంభం కానుండగా.. రెండు నెలలపాటు స్వామివారి మహాదర్శనం కొనసాగనుంది. అందుకు సంబంధించి కేరళ దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి రాధాకృష్ణ తెలిపారు.