మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్‌గా మారిన వీడియోను గుర్తించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
గుహ గ్రామంలోని లార్డ్ కనిఫ్‌నాథ్ ఆలయ స్థలానికి సంబంధించి హిందువుల, ముస్లింల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారం కలెక్టర్, స్థానిక కోర్టులో కూడా పెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా ఈ భూమికి సంబంధించి సివిల్ కోర్టులో కూడా కేసు నడుస్తోంది. పూజా ఆరతి కోరుతూ హిందూ వర్గం వారు తహసీల్ నుండి కలెక్టర్ కు, కోర్టుకు నిరంతరం దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. అయితే హిందువులకు ఆలయంలో పూజలు చేసేందుకు తహసీల్దార్ అనుమతించారు. దీంతో హిందువులు ఆలయాన్ని శుభ్రపరచడం, పూజలకు సిద్ధం చేయడం ప్రారంభించిన క్రమంలో.. ముస్లిం వర్గం వారు దాడులకు పాల్పడ్డారు. భక్తులు, పూజారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు.
Amit Shah: అధికారంలోకి వస్తే అయోధ్య దర్శనం ఉచితం.. అమిత్ షా ఆఫర్
ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత జరిగినా కూడా.. పోలీసులు ఏం పట్టించుకోవడం లేదని హిందువులు మండిపడుతున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు.
https://twitter.com/raviagrawal3/status/1724039704839152006