Police Lathi Charge on Komuravelli Temple Devotees: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంకు భక్తుల భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో శుక్రవారం కొమురవెళ్లి ఆలయ భక్తులతో కిటకిటలాడింది. అయితే పెద్ద పట్నంలోని పసుపు బండారి కోసం ఎగబడిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. Also Read: Summer Temperatures: దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే రికార్డులు బ్రేక్! శుక్రవారం…
ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్‌లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది.
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిసారీ తల్లులను వనంలో నుంచి గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నాని తెలిపారు. ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడంత ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే.. మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అంతేకాకుండా.. భక్తులు తల్లులను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో…
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి…
Ayodhya: గత వారం ఎంతో ఘనంగా అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. దేశ నలుమూలల నుంచి వచ్చేసిన అతిరథమహారధుల మధ్య అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇప్పుడు లక్షలాది మంది ప్రతిరోజు అయోధ్యను సందర్శిస్తున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో రకరకాల దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పడ్డాయి. అలాగే అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని ఏర్పడ్డాయి. అయితే ఓ రెస్టారెంట్ నిర్వాహకుడి చేసిన కక్కుర్తిపని వల్ల ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.…
బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు.
Ayodhya : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.