Vemulawada Temple: తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి సమక్క భక్తులు పోటేత్తుతున్నారు. భక్తుల తాకిడి పెరుగుతున్నడంతో సమ్మక్క జాతర వరకు రాజన్న ఆలయంలో నేటి (ఆదివారం) నుండి వచ్చే నాలుగు ఆదివారాలు రాత్రుళ్ళు నిరంతరం ఆలయం తెరిచి దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. గత కొద్ది రోజులుగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామీ వారిని దర్శించుకు నేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. అయితే ప్రతి రెండేళ్ల ఒక సారి సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకావాలంటే ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. దీంతో రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది.
Read also: Gangula Kamalakar: డిసెంబర్ 9న రుణమాఫీ అన్నారు… ఏమైంది..?
నేటి ఆదివారంతో పాటు వచ్చే 4 ఆదివారాలు రాత్రి భక్తులకు నిరంతరం దర్శనం కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 21, అలాగే 28 తేదీ , ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారల్లో రాత్రి నుండి తెల్లవార్లు రాజన్న ఆలయం తెరిచి ఉంటుందని తెలిపారు. కోడె మొక్కుబడి, దర్శనాలు కొనసాగుతాయని భక్తులు గమనించాలని ఆలయ అధికారుల కోరారు. గర్భగుడిలో సేవలు, అన్నపూజలను అధికారులు రద్దు చేశారు. భక్తుల రద్దీతో గతంలో వచ్చిన హుండీ ఆదాయం కంటే భారీగా పెరిగింది. సీసీ కెమెరాలు, ఎస్పీఎఫ్, పోలీసుల పటిష్ట బందోబస్తులో హుండీ ఆదాయ గణన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఏదైన ఇబ్బందులు తలెత్తితే.. అధికారులకు సంప్రదించాలని కోరారు.
Malla Reddy: త్వరలో పులి బయటకు వస్తోంది… అప్పుడు ఆట మొదలవుతుంది