Devotees to Temples: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని అఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
చార్‌ధామ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యాత్రకు భక్తులు పోటెత్తారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. చార్‌ధాయ్ యాత్ర ఈ నెల 10న ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన…
Bhadradri Ramaiah: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాద్రి శ్రీరామచంద్రుని కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. దీంతో భద్రాచలం రాములోరి ఆలయం మరిం
అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
సోమవారం ప్రయాగ్రాజ్ వద్ద గంగా నది ఒడ్డున భక్తులు సోమవతి అమావాస్యను జరుపుకున్నారు. హిందూమతంలో సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇందులో భక్తులు తమ పూర్వీకుల ఆత్మలు శాంతించాలని స్నానం, దాన, పూజలు, ఆచారాలను నిర్వహిస్తారు.
యూపీలోని బర్సానాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం రాధారాణి ఆలయంలో నిర్వహించిన ముందస్తు హోలీ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలోని మెట్ల రెయిలింగ్ విరిగిపడటంతో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడినట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు.
Police Lathi Charge on Komuravelli Temple Devotees: మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సిద్ధిపేటలోని శైవ క్షేత్రమైన కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయంకు భక్తుల భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. దాంతో శుక్రవారం కొమురవెళ్లి ఆలయ భక్తులతో కిటకిటలాడింది. అయితే పెద్ద పట్నంలోని పసుపు బండారి కోసం ఎగబడిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. Also Read: Summer Temperatures: దంచికొడుతున్న ఎండలు.. మార్చిలోనే రికార్డులు బ్రేక్! శుక్రవారం…
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ఎటాహ్లోని కసా పూర్వి గ్రామం నుంచి గంగాస్నానానికి వెళ్తున్న గ్రామస్తుల ట్రాక్టర్ బదౌన్ హైవేపై ఉన్న చెరువులో అదుపు తప్పి పడిపోయింది.