పూరీ జగన్నాథ ఆలయంలో కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేస్తుంది. ఈ రూల్ నిన్నటి (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. ఒడిశాలోని పూరీ నగరంలోని ప్రఖ్యాత జగన్నాథ టెంపుల్ లోకి హాఫ్ ప్యాంట్, షార్ట్, రిప్డ్ జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు ధరించిన వారికి ప్రవేశం లేదని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి సంప్రదాయబద్దమైన దుస్తులు ధరించాలని అధికారులు కోరారు. కొత్త డ్రెస్ కోడ్ నియమం అమల్లోకి వచ్చిన తర్వాత పురుషులు ధోతీలు ధరించి 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశిస్తున్నారు.
Read Also: Revanth Reddy: పాతబస్తీ మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో.. రూట్ మార్పుతో తగ్గనున్న వ్యయం
ఇక, మహిళలు ఎక్కువగా చీరలు లేదా సల్వార్ కమీజ్‌లలో ఆలయానికి వస్తున్నారు. డ్రెస్ కోడ్‌పై భక్తులకు అవగాహన కల్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం హోటళ్ల యజమానులను తెలిపింది. పూరి ఆలయం లోపల గుట్కా, పాన్ నమలడంపై నిఘా విధించింది. అంతే కాకుండా ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని కూడా అధికారులు నిషేధించింది. నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని ఎదుర్కొనేందుకు తెల్లవారు జామున 1.40 గంటలకే ఆలయ తలుపులు తెరిచారు.
Read Also: Liqour Sales New Record: న్యూ ఇయర్ జోష్.. ఏపీలో రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్
అయితే, సాయంత్రం 5 గంటల వరకు పూరీ జగన్నాథ ఆలయాన్ని 3.5 లక్షల మంది సందర్శించారని ఆలయ కమిటీ చెప్పింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవతల తోబుట్టువుల నిలయమైన ఉన్న ఈ ఆలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. నిర్మాణంలో తాగు నీరు, పబ్లిక్ టాయిలెట్లు లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఆలయంలో సీసీటీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
Read Also: New Year: ఒకే కొత్త సంవత్సరం.. అక్కడ మాత్రం 16 సార్లు వేడుకలు
గతేడాదితో పోల్చితే ఈసారి కొత్త సంవత్సరం రోజున ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. దీంతో పూరి పట్టణంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బడాదండలోని మార్కెట్ చక్కా నుంచి సింగద్వార మధ్య ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా తెలిపింది. దిగబరేణి నుంచి లైట్ హౌస్ వరకు బీచ్ సైడ్ రోడ్డులో వెహికిల్స్ రాకపోకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం లోపల పాన్, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని కూడా అధికారులు నిషేధించారు.