అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి. అయోధ్యలో బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. 5 ఏళ్ల బాలుడి రూపంలో బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. మరో ఐదు రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాగా.. బుధవారం రాంలాల వెండి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనమిచ్చారు. డప్పు, వాయిద్యాల మధ్య భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. కాగా.. గురువారం గర్భగుడిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అయితే జనవరి 22న ఆలయ గర్భగుడిలో ప్రతిష్టించే విగ్రహం ఇది కాదు. కాగా.. బాలరాముడిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలరాముడి దర్శనంతో భక్తులు పరవశించి పోయారు.
Read Also: Kerala: ఒంటెపై పెళ్లి ఊరేగింపు.. వరుడిపై కేసు నమోదు
అంతకుముందు మధ్యాహ్నం జల యాత్ర, తీర్థపూజ, బ్రాహ్మణ-బతుక్- కుమారి-సువాసిని పూజ, వర్ధినీ పూజ, కలశయాత్ర నిర్వహించారు. జనవరి 21 వరకు ఈ పూజలు కొనసాగుతాయని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామాలయంలో రాంలాలా ప్రత్యేక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు పాల్గొననున్నారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం ముగింపులో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి 8,000 మంది అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే వారిలో కొందరిని మాత్రమే ఆలయ గర్భగుడిలోకి అనుమతించనున్నారు.
Read Also: PM Modi: అభివృద్ధిలో ట్రాక్ రికార్డ్ కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే..