అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు భారతీయ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ‘ఆస్తా’ పేరుతో స్పెషల్ ట్రైన్లు నడుపుతామని తెలిపింది. మొత్తం 200కి పైగా ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. ఈ రైళ్లు దేశవ్యాప్తంగా 66 వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ అయోధ్యకు చేరుకుంటాయని పేర్కొంది. కాగా.. రామాలయానికి వెళ్లే భక్తుల కోసం ఒక్కో రైలులో 22 కోచ్‌లు ఉంటాయి. భక్తుల డిమాండ్‌ను బట్టి రైళ్ల సంఖ్యను తర్వాత పెంచనున్నారు. న్యూఢిల్లీ, పాత ఢిల్లీ, నిజాముద్దీన్, ఆనంద్ విహార్ నుండి ప్రత్యేక ఆస్తా రైళ్లు ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అగర్తలా, టిన్సుకియా, బార్మర్, కత్రా, జమ్ము, నాసిక్, డెహ్రాడూన్, భద్రక్, ఖుర్దా రోడ్, కొట్టాయం, సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట నుంచి కూడా ఆస్తా స్పెషల్ ట్రైన్లు నడువనున్నాయి.
తమిళనాడులో చెన్నై, సేలం, మదురై సహా తొమ్మిది స్టేషన్ల నుంచి ఆస్తా ప్రత్యేక రైలును ప్రారంభించనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పూణే, ముంబై, వార్ధా, జల్నా, నాసిక్‌లోని మొత్తం ఏడు స్టేషన్ల నుండి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రామ మందిరం ప్రారంభోత్సవం రోజు అంటే జనవరి 22 నుంచి 100 రోజుల పాటు అయోధ్య నుంచి భారతదేశంలోని వివిధ నగరాలలో నడుస్తాయి. ఈ రైళ్లలో ప్రయాణించాలంటే రౌండ్-ట్రిప్ టిక్కెట్లు ఉంటాయి. అంటే డబుల్ వే టికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 100 రోజుల వ్యవధిలో రోజూ 50,000 నుంచి 55,000 మంది భక్తులు రైలులో అయోధ్య ధామ్ స్టేషన్‌కు ప్రయాణిస్తారని భారతీయ రైల్వే అంచనా వేసింది. భవిష్యత్తులో డిమాండ్‌ను బట్టి మరికొద్ది రోజులు ఈ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌ను పొడిగించవచ్చు.
TTE Suspend: టికెట్ లేదని ప్రయాణికుడిని చితకబాదిన టీటీఈ.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అఫీషియల్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. కాగా.. ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు శాకాహారం మాత్రమే సర్వ్ చేస్తారు. రైల్వే నిర్వాహకులు అందించిన ప్రయాణికుల జాబితాలో ఆధార్ నంబర్, అడ్రస్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటి ప్రయాణికుల వివరాలు యాడ్ చేస్తారు. అంతేకాకుండా.. రిజర్వేషన్, సూపర్ ఫాస్ట్ ఛార్జీలు, క్యాటరింగ్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జ్, GST వంటి ఛార్జీలు వర్తిస్తాయి.
ఆస్తా రైళ్లకు పరిమిత స్టాప్‌లు ఉంటాయి. అవి కూడా ట్రైన్ ఆపరేషన్ పనుల కోసమే ఆగుతాయి. ఇవి వివిధ రాష్ట్రాలలోని టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి నడుస్తాయి. ఆస్తా రైళ్లు నడిచే రాష్ట్రాలలో ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తెలంగాణ, జమ్ము కశ్మీర్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో ఈ ఆస్తా ట్రైన్స్ సికింద్రాబాద్ – అయోధ్య – సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్ – అయోధ్య – కాజీపేట జంక్షన్ రూట్స్‌లో నడుస్తాయి. రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్య వెళ్లాలనుకునే ఏపీ భక్తులకు వైజాగ్ నుంచి అయోధ్యకు ఆస్తా ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.
Khammam: కుప్పకూలిన గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. తప్పిన పెను ప్రమాదం