Komaravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఆదివారం నుంచి 8 ఆదివారాల పాటు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఇందుకోసం ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. ఆదివారం స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకుంటారు. తిరిగి సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. గదులు లేకపోవడంతో కొందరు భక్తులు తాము వచ్చిన వాహనాల్లోనే బస చేస్తున్నారు. కొందరు ఖాళీ స్థలాల్లో టెంట్లు వేశారు. ఆదివారం స్వామిని దర్శించుకున్న అనంతరం పూజలు చేస్తారు. సోమవారం పెదపట్నం, అగ్నిగుండ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Bigg Boss Fake Call: బిగ్‌బాస్‌లో ఛాన్స్ అంటే నమ్మింది.. రూ.2.50 లక్షలు పోగొట్టుకుంది
ఆలయ బావి దగ్గర కాంపౌండ్ వాల్ ఎడమవైపు వీఐపీ పార్కింగ్, సిద్దిపేట, చేర్యాల, కిష్టంపేట, కొమురవెల్లి కమాన్ నుంచి వచ్చే వాహనదారులు బస్టాండ్ పక్కనే పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, కొండపోచమ్మ దేవాలయం, ఐనాపూర్ వైపు నుంచి వచ్చే వారికి కొమురవెల్లి పెట్రోల్ పంపు వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు అలర్ట్ గా ఉండాలని చిన్న పిలల్లను చేతులు వదలకుండా పట్టుకోవాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అక్కడే వున్న పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Metro : మెట్రో ప్లాట్‌ఫారమ్‌పై పడిన పిల్లాడిని ప్రాణాలకు తెగించి కాపాడిన గార్డ్