ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
బీసీసీఐ సెక్రటరీ జైషాకు శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడంటూ జై షాపై.. ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఈ విషయంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. శ్రీలంక పార్లమెంట్లో మంత్రి కాంచన విజేశేఖర మాట్లాడుతూ.. మా ప్రభుత్వం తరపున జై షాకు క్షమాపణలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు స్టేడియంకి రానున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం కొందరు అతిరథులు స్టేడియానికి రానున్నారు.
ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో హోరాహోరీ పోరు జరుగనుంది. ఈ క్రమంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల జీతాల గురించి మాట్లాడితే ఎలా ఉన్నాయంటే.... ఆస్ట్రేలియా డేరింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్ వంటి ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 350,000 డాలర్లు ఉంది.
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.
ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.