World Cup 2023 Final: ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బెలిటోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సినిమా హాల్ సమీపంలో జరిగిందని పోలీసులు వెల్లడించారు.
రాహుల్ లోహర్ ఆ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేసేవాడు. ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆదివారం సెలవు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో భారత్ ఓడిపోవడంతో మనస్తాపానికి గురైన అతను తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బావమరిది ఉత్తమ్ సూర్ తెలిపారు. కాకపోతే తన జీవితంలో అలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సోమవారం ఉదయం బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు పంపించామని, అసహజ మరణంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ICC World Cup 2023 Team: కెప్టెన్‌గా రోహిత్.. ఐసీసీ ప్లేయింగ్ 11లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు!
ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేరని వారు తెలిపారు. హత్యకు గల కారణాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన పోలీసులు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ టైటిల్ పోరులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.