World Cup: వరల్డ్ కప్ ఫైనల్ ఈ రోజు ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్ లో భరత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే టీం ఇండియా విజయం కోసం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించారు. 2011 లో వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భరత్ ఆ తరువాత జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలయింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత మళ్ళీ టీం ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ (వరల్డ్ కప్ 2023 ఫైనల్) ఫైనల్‌కు చేరుకుంది. దీనితో అందరి లోనూ ఆసక్తి నెలకొంది.
Read also:Israel-Hamas War: బందీల విడుదలపై ఒప్పందం.. ఇజ్రాయిల్ రియాక్షన్ ఇదే..
టీం ఇండియా గెలవాలని కప్ ను కైవసం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పూజలు జరిపిస్తున్నారు. ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. కాగా మ్యాచ్ కు ముందే ఇండియా జట్టు విజయం కోసం ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి నిర్వహించగా ఆ వీడియో ప్రస్తుతం బయకు వచ్చింది. ఇక టీం ఇండియా కూడ వరల్డ్ కప్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెమీ ఫైనల్‌తో సహా 10 మ్యాచ్‌లలో 10 గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ లలో ప్రతి ఒక్కరు ప్రభంజనం సృష్టించారు. బౌలర్లు పదునైన బౌలింగ్‌తో విధ్వంసం సృష్టిస్తుండగా బ్యాట్స్‌మెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మహ్మద్ షమీ 23 వికెట్లతో బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.