క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు.
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారా? అంటూ అసందర్భ ప్రేలాపనలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ లోనే కాదు, పాకిస్థాన్ లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈనెల 23న విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ-20 మ్యాచ్ జరగనుంది. టీ-20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకాలు 15, 16 తేదీల్లో పేటీఎం (ఇన్సైడర్.ఇన్) ద్వారా ఉ. 11.00 గం. నుంచి జరుగుతాయని ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి తెలిపారు.
ఈ ప్రపంచకప్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రేపు న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఇంతకుముందు న్యూజిలాండ్-ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియాను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చివరి దశకి చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనుండగా... ఈ నెల 19వ తేదీన జరిగే ఫైనల్ జరుగనుంది. దీంతో ఈ మెగా టోర్నీ సమాప్తమవుతుంది. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల కోసం ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహించనున్నారు.
వరల్డ్‌కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు.