విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ముఖేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, జితేశ్, రింకూ సింగ్ తదితరులు వైజాగ్ కు వచ్చారు.
Tsunami Risk to Japan: జపాన్‌కు సునామీ తప్పదా?
అయితే.. ఈ సిరీస్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 45 రోజుల పాటు జరిగిన ఈ వరల్డ్ కప్ లో ఆడిన చాలామంది ఆటగాళ్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్, యజువేంద్ర చహల్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించనుందని భావిస్తున్నారు.
Mallikarjuna Kharge: ‘రాహుల్ దేశం కోసం చనిపోయాడు’.. ఇది ఎప్పుడు జరిగిందయ్యా..!
మరోవైపు.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అద్భుతంగా ఆడి పరుగుల సునామీ సృష్టించిన రియాన్ పరాగ్ ఈ సిరీస్ కు ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ లో టీమిండియా కోచ్ గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తారని తెలుస్తోంది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ఈ వరల్డ్ కప్ తో ముగియనుంది.
China: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చైనా శాంతి దూత అవుతుందా?
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ షెడ్యూల్ ఎలా ఉందంటే… నవంబరు 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. నవంబరు 26న రెండో టీ20 తిరువనంతపురంలో జరగనుంది. నవంబరు 28న మూడో టీ20 గువాహటిలో జరగనుంది. డిసెంబరు 1న నాలుగో టీ20 నాగపూర్ లో జరగనుంది. డిసెంబరు 3న ఐదో టీ20 హైదరాబాద్ లో జరగనుంది.