టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మెగాటోర్నీలో తనదైన బ్రాండ్ క్రికెట్‌తో ఆకట్టుకున్న రోహిత్.. చివరకు ట్రోఫీని సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ చర్చలు మొదలు పెట్టిందట. ఈ క్రమంలో…
విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా 45 రోజులపాటు వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న టీమిండియా అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వరల్డ్ కప్ మహా సంగ్రామం ముగిసిపోయింది. దీంతో తర్వాత వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే వరల్డ్ కప్ లో కొందరు స్టార్ ఆటగాళ్లు దూరంకానున్నారు.
ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్లో సెంచరీ.. ఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి నం. 3 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కోహ్లీ రేటింగ్ పాయింట్లు పొంది టాప్ 2 బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ల దగ్గరిలో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. టాప్ 4 స్థానానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎగబాకాడు.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ మహిళల ఆట సమగ్రతను, క్రీడాకారుల భద్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐసీసీ తెలిపింది.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2027 ఆడనున్నట్లు తెలిపాడు. 2023 ప్రపంచకప్‌లో డేవిడ్ వార్నర్ తన జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు.
45 రోజుల పాటు భారత్‌లో వరల్డ్ కప్ ఫీవర్ నడిచింది. తాజాగా ఆదివారం ఫైనల్ లో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ తో ప్రపంచ కప్ 2023 పూర్తయింది. అయితే ఈసారి ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంటారని అనుకున్న టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ప్రపంచకప్ ట్రోఫీని టీమిండియా చేతిలో చూడాలంటే ఇంకో నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. వన్డే క్రికెట్లో తదుపరి ప్రపంచకప్ 2027లో జరగనుంది.
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కన్ను వేశాడు. సూర్య.. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులకు కేవలం 159 పరుగులు కావాలి. ఆ పరుగులు చేస్తే.. 52 ఇన్నింగ్స్‌లలో అత్యంత వేగంగా మైలురాయిని చేరిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సమం చేస్తాడు.