పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించేందుకు పాకిస్తాన్ తమ మాజీ బౌలింగ్ స్టార్లలో ఇద్దరిని నియమించింది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్, స్పిన్ బౌలింగ్ కోచ్ గా సయీద్ అజ్మల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. మొదట్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుని అన్నీ మ్యాచ్‌ల్లో గెలుపొంది. ఇప్పుడు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్‌ను ఒడిసిపట్టింది.
వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అనంతపురం జిల్లాలో బెట్టింగురాయుళ్లపై ప్రత్యేక నిఘా విధించింది సైబర్‌సెల్. అనంతపురం పోలీస్ సైబర్ సెల్ ద్వారా సుమారు 70 బెట్టింగ్ ఆన్లైన్ యాప్‌లను గుర్తించారు. ఈ యాప్‌లను నిషేధించాలని సంబంధిత శాఖలకు జిల్లా ఎస్పీ సిఫారసు లేఖ రాశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడినా, నిర్వహించినా, ప్రోత్సహించినా ఉపేక్షించమన్నారు.