World Cup Final 2023: ఫైనల్ పోరులో కీలక మార్పులు.. ఆ ఆటగాడికి ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. రేపు జరగనున్న టైటిల్ పోరులో ఇండియా-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కావున.. టైటిల్ గెలుచుకోవాలనే ఆశతో భారత్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా టైటిల్ గెలిచి వరల్డ్‌కప్ చరిత్రను పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది.
Hardik Pandya: ఎంతో మంది భారతీయుల కల.. కప్ గెలవాలి..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియాలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఒక మార్పుతో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ స్ధానంలో వెటరన్ రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశమివ్వాలని టీమిండియా మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులోకి తీసుకురావాలని హెడ్‌కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఆర్.అశ్విన్ ఈ టోర్నీలో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఆడగా.. ఈ మ్యాచ్‌లో అద్బుతంగా బౌలింగ్ చేశాడు. 8 ఓవర్లు వేసిన అశ్విన్.. 34 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీశాడు. ఈ క్రమంలో మరోసారి అతడి అనుభవాన్ని ఊపయోగించుకోవాలని టీమిండియా మేనెజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అశ్విన్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయమన్పిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!