India Vs New Zealand: నిన్న జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ క్రికెట్ లవర్స్‌కి మంచి అనుభూతిని ఇచ్చింది. కెప్టెన్ రోహిత్ మెరుపు ఓపెనింగ్‌తో పాటు గిల్ సూపర్ ఇన్నింగ్స్ ఒకెత్తయితే, కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలోతో ఔరా అనిపించారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును బద్ధలు కొడుతూ.. వన్డేల్లో 50వ సెంచరీ చేసి విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. బుధవారం జరిగిన ఈ మ్యాచుని దేశం…
టీ20 జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత షాహీన్ అఫ్రిదిలో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. కెప్టెన్ అయిన తర్వాత.. షాహీన్ అఫ్రిది ఒక ట్వీట్‌లో ఇలా వ్రాశాడు. “నేను జాతీయ టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నందుకు గౌరవంగా, సంతోషిస్తున్నాను. నాపై విశ్వాసం చూపినందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు. జట్టు స్ఫూర్తిని కొనసాగించడానికి, క్రికెట్ మైదానంలో నా దేశానికి కీర్తిని తీసుకురావడానికి నేను నా వంతు కృషి చేస్తాను. అని తెలిపాడు.
ప్రపంచకప్ 2023 ట్రోఫీని అందుకోవడానికి టీమ్ ఇండియా కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. సెమీఫైనల్లో టీమిండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. నవంబర్ 19న నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు రోహిత్ సేన సిద్ధంగా ఉంది.
వరల్డ్ కప్లో ఫైనల్స్‌కు దూసుకెళ్లింది టీమిండియా. 2019 పరాభవానికి న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది టీమిండియా. భారత్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Babar Azam: ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటోంది. పాక్ మాజీ క్రికెటర్లు ప్లేయర్లను ఏకిపారేస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడనే ఊహాగానాల నేపథ్యంలో, బుధవారం అన్ని పాకిస్తాన్ క్రికెట్ టీం కెప్టెన్ నుంచి వైదొగులుతున్నట్లు బాబార్ ఆజమ్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని వదులుకున్నాడు.
2023 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన తర్వాత పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు.
వాంఖడే మైదానంలో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కింగ్ కోహ్లీ పేరిట ఉంది. 2023 ప్రపంచ కప్లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీ-ఫైనల్ మ్యాచ్లో విరాట్ బ్యాట్ నుండి ఈ చారిత్రాత్మక సెంచరీ వచ్చింది.
టీమిండియా స్టార్ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్(105) శతకాలతో అదరగొట్టారు.