వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. మొదట్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుని అన్నీ మ్యాచ్ల్లో గెలుపొంది. ఇప్పుడు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ను ఒడిసిపట్టింది.
Sunil Gavaskar: రోహిత్ శర్మ ఆ షాట్ కొట్టకుండా ఉండాల్సింది..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా తడబడింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 240 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత లక్ష్యచేధనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో అందరూ ప్లేయర్లు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరచడంతో.. 6 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (137) పరుగుల అద్భుత బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. అతడికి తోడు లబుషేన్ (58) పరుగులతో రాణించి నాటౌట్ గా నిలిచాడు.
Earthquake: అండమాన్ సముద్రంలో భూకంపం..
ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్లు మొదట్లో బౌలింగ్ చేసి 3 వికెట్లు వెంట వెంటనే పడగొట్టారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడటంతో టీమిండియా బౌలర్లకు అవకాశమివ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా 6 వికెట్లు, 7 ఓవర్లు ఉండగానే గెలిచింది. ఇక.. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా.. షమీ, సిరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఐతే.. ఈ వరల్డ్ కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమిండియా అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి.