T20 World Cup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా ఆస్ట్రేలియాకు చేరుకుని అక్కడ ప్రాక్టీస్ మ్యాచ్‌లను ఆడుతూ తన అస్త్రాలకు పదును పెడుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.…
Ishan Kishan: రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన ఇషాన్ బ్యాటింగ్ అభిమానులను అలరించింది. ఈ క్రమంలో అతడు తన పేరిట కొత్త రికార్డులు నమోదు చేసుకున్నాడు. ఒక వన్డేలో 7 సిక్సులు కొట్టిన రెండో భారత యంగెస్ట్ ప్లేయర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు. గతంలో రిషబ్ పంత్ పేరిట ఈ రికార్డు ఉండేది. పంత్ 23 ఏళ్ల 173…
రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
IND Vs SA: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులు చేసింది. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్, జిడ్డు బ్యాటింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానంలో ఆల్‌రౌండర్లు షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్‌లను జట్టులోకి తీసుకుంది. ఇప్పటికే తొలివన్డేలో ఓటమి పాలైన టీమిండియా రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ వన్డే…
Asia Cup 2022: పురుషులు విఫలమైన చోట మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. మహిళల ఆసియా కప్‌లో టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఓటమి నుంచి తేరుకున్న టీమిండియా శనివారం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను 59 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన భారత్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ షెఫాలి వర్మ రాణించింది. ఆమె 44 బంతుల్లో 5 ఫోర్లు, 2…
South Africa: రాంచీలో నేడు భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది. అయితే రెండో వన్డే ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ విషాద వార్తను అభిమానులతో పంచుకున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ మిల్లర్ కుమార్తె శనివారం నాడు మృతి చెందింది. మిల్లర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ మేరకు ‘రిప్ మై లిటిల్ రాక్‌స్టార్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా’ అని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. అయితే…
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన బాబర్ ఆజమ్ ఒకేసారి టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను సమం చేశాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 28వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో వేగంగా 28 హాఫ్ సెంచరీల ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్…
T20 WorldCup: ఈనెల 23 నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని మొత్తం 14మంది ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ సభ్యులు రెండ్రోజుల క్రితమే విమానంలో ఆసీస్ వెళ్లారు. అయితే గాయం కారణంగా టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో బీసీసీఐ ఎవరినీ నియమించలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా స్థానంలో ఎంపికయ్యే ఆటగాడు ఆస్ట్రేలియా…
Mohammad Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన ఓ పోస్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దసరా పర్వదినాన శ్రీ రాముడు మీ జీవితంలోని కోరికలను అన్నింటినీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సంతోషం, సంపద, విజయం అందించాలని నేను…