Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో కీలక ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేల నుంచి అతడు తప్పుకున్నాడు.…
BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక…
Shikar Dhawan: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యారు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ జిడ్డు బ్యాటింగ్ ఆడటంతో రన్‌రేట్ కొండెక్కింది. చివరకు సంజు శాంసన్ పోరాడినా ఫలితం దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన…
Asia Cup 2022: ఆసియా కప్ విషయంలో పురుషుల బాటలోనే టీమిండియా మహిళలు పయనించారు. ఇటీవల జరిగిన సూపర్-4లో విభాగంలో పాకిస్థాన్‌పై ఓటమి చెంది టోర్నీ నుంచి టీమిండియా తప్పుకుంది. తాజాగా మహిళల ఆసియా కప్‌లోనూ టీమిండియాకు చేదు ఫలితం ఎదురైంది. టీమిండియాపై పాకిస్థాన్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పవర్ ప్లేలో మూడు…
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Team India: ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో…
Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్‌గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42…
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ…
IND Vs SA: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టీ20లో దక్షిణాఫ్రికా 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. 228 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 18.3 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ స్థానంలో జట్టులో ఎంపికైన శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే బర్త్ డే బాయ్ రిషబ్ పంత్ 27…
IND Vs SA: ఇండోర్‌లో టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ మరోసారి రాణించాడు. అతడు 43 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోసౌ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో…