IND Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకే ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో రాణించని దీపక్ హుడాపై వేటు వేసింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గ్రూప్-2లో భారత్ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై టీమిండియా గెలుపొందగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. బంగ్లాదేశ్‌పై గెలవడం టీమిండియాకు తప్పనిసరి. అటు బంగ్లాదేశ్ కూడా టీమిండియాను ఓడించాలని వ్యూహాలు రచించి బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
బంగ్లాదేశ్: షకీబుల్ హసన్ (కెప్టెన్), నజముల్ హుస్సేన్, లిట్టన్ దాస్, అఫిఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దీక్ హుస్సేన్, నురుల్ హసన్, హసన్ మహమూద్, టస్కిన్ అహ్మద్, ఫోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహ్మాన్
🚨 Toss & Team Update from Adelaide 🚨
Bangladesh have elected to bowl against #TeamIndia. #T20WorldCup | #INDvBAN
Follow the match ▶️ https://t.co/Tspn2vo9dQ
1⃣ change to our Playing as @akshar2026 is named in the team 🔽 pic.twitter.com/eRhnlrJ1lf
— BCCI (@BCCI) November 2, 2022