ICC Rankings: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మరోసారి తన సత్తా చూపాడు. తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుత T20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో 863 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ సమయంలో సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంకును పొందాడు. మార్చి, 2021లో అరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే ఈ ర్యాంకు పొందాడు. ఈ జాబితాలో 842 పాయింట్లతో పాకిస్థాన్ ఓపెనర్ రిజ్వాన్ రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే మూడో స్థానంలో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పదో ర్యాంకుకు చేరుకున్నాడు.
Read Also: IND Vs BAN: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఒకే ఒక్క మార్పు చేసిన టీమిండియా
అటు టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు హసరంగ, దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ, ఆస్ట్రేలియా ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ముజీబుర్ రెహ్మాన్ టాప్-5లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ ర్యాంకుల్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ టాప్-1 స్థానం నిలుపుకున్నాడు. మహ్మద్ నబీ, హార్దిక్ పాండ్యా, మొయిన్ అలీ, జేజే స్మిత్, సికిందర్ రజా, డేవిడ్ వీస్, హసరంగ, స్టాయినీస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ టాప్-10లో ఉన్నారు.
Suryakumar Yadav becomes no.1 T20I batter in the latest ICC T20I ranking.
(File Pic) pic.twitter.com/08QYObG7RS
— ANI (@ANI) November 2, 2022