T20 World Cup: టీ20 క్రికెట్లో తోపుగాళ్లు ఎవరంటే ఎవరైనా వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లే చెప్తారు. పొలార్డ్, హోల్డర్, గేల్, లూయీస్, ఆండీ రసెల్, సునీల్ నరైన్, పూరన్, హిట్మెయిర్, బ్రావో.. ఇలా అందరూ హిట్టర్లే ఉన్న జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధంతరంగా వైదొలుగుతుందని ఎవరైనా ఊహిస్తారా. కానీ అదే నిజమైంది. రెండుసార్లు టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు ఈ ప్రపంచకప్‌లో ఘోర అవమానం ఎదురైంది. గ్రూప్ దశలోనే పసికూనలను ఎదుర్కోలేక ఇంటి…
T20 World Cup: బ్రిస్బేన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా భారీ వర్షం గబ్బా మైదానాన్ని ముంచెత్తడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. మెగా టోర్నీకి ముందు టీమిండియాకు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను కేటాయించగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో…
Cricket: ఆసియా కప్ 2023 విషయంలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వివాదం నెలకొంది. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో పాల్గొనేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆసియా కప్‌ను తటస్థ వేదికలో నిర్వహించేలా ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై ఒత్తిడి తెస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. అయితే పాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌ను ఇండియా బాయ్‌కాట్ చేస్తే.. వచ్చే ఏడాది ఇండియాలో జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌ను తాము బాయ్‌కాట్ చేస్తామని…
Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ శకం ముగిసింది. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. ముంబైలో మంగళవారం బీసీసీఐ ఏజీఎం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ ఏకాభిప్రాయంతో రోజర్ బిన్నీని అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ఈ పదవికి మరెవరూ పోటీ చేయకపోవడంతో బిన్నీ ఎన్నిక సులువుగా మారింది. మరోవైపు బీసీసీఐ సెక్రటరీగా మరోసారి జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా రాజీవ్ శుక్లా, జాయింట్ సెక్రటరీగా…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఉత్కంఠభరితంగా సాగింది. భారత్ విధించిన 187 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ఛేదించలేకపోయింది. టీమిండియా బౌలర్ షమీ ధాటికి 180 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆరు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ అరోన్ ఫించ్ ఒక్కడే రాణించాడు. ఫించ్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 76…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ కూడా 33 బంతులనే ఎదుర్కొన్నాడు. అతడు 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో…
IPL 2023: కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ బోసిపోయింది. మ్యాచ్‌లన్నీ ఒకే చోట లేదా పరిమిత స్టేడియాలలో నిర్వహిస్తుండటం వల్ల ఐపీఎల్ కళ తప్పింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 2023 సీజన్‌ను హోమ్ అండ్ అవే పద్ధతిలో నిర్వహించాలని కసరత్తులు చేస్తోంది. అంతేకాకుండా 2023 సీజన్ కోసం బీసీసీఐ మినీ వేలం ప్రక్రియను నిర్వహించబోతోంది. ఈ ఏడాది డిసెంబర్ 16న బెంగళూరు వేదికగా ఐపీఎల్ మినీ వేలం…
T20 World Cup: క్రికెట్ ప్రపంచంలో వెస్టిండీస్ జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ జట్టు నిండా హిట్టర్లే ఉంటారు. కానీ నిలకడలేమితో ఆ జట్టు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు దిగ్గజ జట్టుగా ప్రశంసలు పొందిన ఆ జట్టు నేడు ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్ జట్టు సగర్వంగా అందుకుంది. 2012, 2016లో పొట్టి ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచింది. తొలిసారి టీ20…
T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే పసికూన నమీబియా సంచలనం నమోదు చేసింది. శ్రీలంకపై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రస్తుతం కరోనా కూడా మెగా టోర్నీకి గుబులు పుట్టిస్తోంది. కరోనా సోకిన ఆటగాడు దూరమైతే పలు జట్లు నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది. టోర్నీ సమయంలో ఆటగాళ్లకు కోవిడ్ టెస్ట్…
T20 World Cup 2022: భారీ అంచనాల నేపథ్యంలో ఆదివారం నాడు టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. తొలుత క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే సంచలనం నమోదైంది. శ్రీలంకపై నమీబియా గెలిచి షాక్ ఇచ్చింది. అక్టోబర్ 22 నుంచి సూపర్-12 రౌండ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టోర్నీలో రిజర్వు డేను కూడా ఐసీసీ అమలు చేస్తోంది. ఈ రిజర్వు డేను కేవలం నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే ఉపయోగించనున్నారు. వర్షం లేదా…