Veg Fish Curry: చేప లేని ‘చేపల పులుసు’.. అదిరిపోయే టేస్ట్! ఇలా చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veg Fish Curry: నాన్ వెజ్ ప్రియులకి చేపల పులుసు అంటే ఉండే ప్రాణం అంతా ఇంతా కాదు. కానీ, ప్యూర్ వెజిటేరియన్స్ కి లేదా నాన్ వెజ్ తినని రోజుల్లో ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే వారికి చేప లేని చేపల పులుసుకు కూర మామూలు కిక్ ఇవ్వదు. నిజానికి ఈ ‘వెజ్ ఫిష్ కర్రీ’ వారికి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. అరటికాయతో చేసే ఈ పులుసు చూడటానికి అచ్చం చేప ముక్కల్లానే ఉండటమే కాకుండా, రుచిలో కూడా చేపల పులుసును తలపిస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ASLSO: T20 World Cup 2026 ఫైనల్‌కు ముందే సంబరాలు.. ఆకట్టుకోనున్న స్టార్ల ప్రదర్శనలు..
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
కావలసిన పదార్ధాలు:
అరటికాయలు: 2 (సుమారు 400 గ్రాములు)
చింతపండు: 25 గ్రాములు (నిమ్మకాయ సైజు)
ఉల్లిపాయలు: 4 (మీడియం సైజు)
టమాటాలు: 2 నుంచి 3 (ప్యూరీ కోసం)
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: అర టేబుల్ స్పూన్
మెంతులు: అర టీస్పూన్
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె, కారం, పసుపు, ఉప్పు.
తయారీ విధానం:
ముందుగా అరటికాయలను పైన తొక్కు తీసేసి, చేప ముక్కల్లాగా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల మధ్యలో చిన్న రంధ్రం చేస్తే అచ్చం చేప ముక్కల్లా కనిపిస్తాయి. వీటిని పసుపు, ఉప్పు కలిపిన నీటిలో వేసి శుభ్రం చేయాలి. తర్వాత ఒక ప్లేట్‌లో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి మసాలా ముద్దలా చేయాలి. ఈ మసాలాను అరటికాయ ముక్కలకు పట్టించి 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అనంతరం, పెనంపై కొద్దిగా నూనె వేసి ఈ ముక్కలను రెండు వైపులా లైట్‌గా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులను దోరగా వేయించి పొడి చేయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఉల్లి ముద్దను సిద్ధం చేసుకోవాలి.
కడాయిలో నూనె వేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. సిద్ధం చేసుకున్న ఉల్లి ముద్దను వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి, ఆపై టమాటా ప్యూరీని కలపాలి. నూనె పైకి తేలే సమయంలో కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి మరిగించాలి. చింతపండు రసం, తగినన్ని నీళ్లు పోసి పులుసును బాగా మరిగించాలి. పులుసు మరుగుతున్నప్పుడు రోస్ట్ చేసిన అరటికాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే గుమగుమలాడే వెజ్ ఫిష్ పులుసు సిద్ధం. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని ఇంట్లో ఏదైనా స్పెషల్ సందర్భాల్లో లేదా అతిథులు వచ్చినప్పుడు వడ్డిస్తే, ముక్క తింటే తప్ప అది చేప కాదని ఎవరూ కనిపెట్టలేరు. అంతటి అద్భుతమైన రుచితో ఈ పులుసు మెప్పిస్తుంది.
READ ASLSO: ViralVideo: ఛీఛీ చదువు చెప్పాల్సిన గురువే.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!