Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Elections: ‘‘జెన్ Z’’ ఉద్యమం తర్వాత నేపాల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ప్రధానమంత్రి అభ్యర్థి బాలెన్ షా ఘన విజయం సాధించారు. నేపాల్ కాబోయే ప్రధానిగా బాలెన్ షా ఉన్నారు. నేపాల్ యువతలో క్రేజ్ కలిగిన ఈ మాజీ రాపర్, సింగర్ ఇప్పుడు నేపాల్ దశాదిశను నిర్ణయించబోతున్నారు. ఝాపా జిల్లాలోని 5వ నియోజకవర్గం నుంచి బాలెన్ షా విజయం సాధించారు. నేపాల్ మాజీ ప్రధాని, జెన్ జీ యువత ఉద్యమం తర్వాత నేపాల్ ప్రధానిగా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా 50,000 ఓట్ల తేడాతో ఓలిపై బాలెన్ షా గెలిచారు.
Also Read
- Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
- Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
తుది ఓట్ల ఫలితాల ప్రకారం, బాలెన్ షా మొత్తం 68,348 ఓట్లు సాధించగా, కె.పి. శర్మ ఓలి ఈ నియోజకవర్గంలో దాదాపు 18,000 ఓట్లు సాధించారు. అందువల్ల, ఇద్దరు అభ్యర్థుల మధ్య దాదాపు 50,000 ఓట్ల తేడా ఉంది. ఓలి భారత్ వ్యతిరేకిగా పేరుంది. తన పాలనలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టలేదని కామెంట్స్ చేశారు. ఇక భారత్‌లో అంతర్భాగంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవే అని చెప్పుకున్నారు.
275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రత్యక్షంగా ఎన్నికైన 165 స్థానాల్లో RSP 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బాలెన్ షా ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను నేపాల్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఆర్ఎస్పీ తర్వాత రెండో స్థానంలో నేపాల్ కాంగ్రెస్ 15 సీట్లతో ఉంది. ఓలీ పార్టీ 10 లోపు స్థానాలకే పరిమితమై ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. నేపాల్ ప్రజాస్వామ్య చరిత్రలో 36 ఏళ్ల లో మొదటిసారిగా ఒక పార్టీకి నేపాల్ ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టారు.
తాజావార్తలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Infinix Hot 70 Pro 5G: భారత్ లో విడుదల కానున్న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో.. 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సూపర్ ఫీచర్స్
-
Awarapan 2: ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్తున్న ‘అవరాపన్ 2’
-
Dhanush Digital : ధనుష్ సోషల్ మీడియా IT వింగ్.. పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
ట్రెండింగ్
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్‌తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!