Shreyas Iyer: జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరం కాబోతున్నాడు. ఈ సిరీస్‌కు ఆయనకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి క్లియరెన్స్ లభించలేదని సమాచారం. గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ బ్యాటింగ్ చేయగలిగినా, మైదానంలో ఫీల్డింగ్ చేసేంత శారీరక బలం ఇంకా రాలేదని వైద్య వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ…
Deepti Sharma: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్, భారత బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో టీమిండియా 15 రన్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేస్తూ, ప్రపంచకప్ గెలిచిన ఏడాదిని భారత్ ఘనంగా ముగించింది. Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్…
Smriti Mandhana: ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది. బ్యాటరీ బాంబ్ పేల్చిన Realme.. 10,001mAhతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనం..! మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా…
Bumrah-Hardik: అంతర్జాతీయ మ్యాచ్ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని భారత కీలక ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్మెంట్పై జట్టు యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో జరిగే టీ20 ప్రపంచకప్ ప్రధాన లక్ష్యంగా ఉండటంతో.. ఈ ఇద్దరు కీలక వైట్‌బాల్ ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. IP68+IP69+IP69K రేటింగ్స్, Snapdragon 8s…
Smriti Mandhana: తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్, శ్రీలంక నాలుగో టీ20లో టీమిండియా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో ఆటగాడిగా మంధాన నిలిచింది. ఈ ఘనత సాధించిన రెండో భారత మహిళా. భారత్ తరఫున ఈ జాబితాలో మిథాలీ రాజ్ 10,868 పరుగులతో ముందుంది. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) 10,652 పరుగులు, షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) 10,273 పరుగులతో…
SL vs IND: తిరువనంతపురం వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మూడో మహిళల టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. శ్రీలంక జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 112 పరుగులకే పరిమితమయ్యారు. వారి ఇన్నింగ్స్ లో హసిని పెరెరా (25), ఇమేషా దులానీ (27) మాత్రమే కొంత పోరాటం చేశారు. మిగితా వారి నుంచి వారికి మద్దతు దొరకలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 4…
Mumbai vs Uttarakhand: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన గ్రూప్ C మ్యాచ్‌లో ముంబై 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయినప్పటికీ.. మిగతా బ్యాటర్లు అద్భుతంగా రాణించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ బ్యాటర్ హార్దిక్ తమోరే 82 బంతుల్లో…
Delhi vs Gujarat: విజయ్ హజారే ట్రోఫీ 2025 ఎలైట్ గ్రూప్–Dలో భాగంగా బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు గుజరాత్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మ్యాన్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ…
AUS vs ENG 4th Test: యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్బోర్న్ వేదికగా నేటి నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ మొదలయింది. ఇక నేడు తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. పూర్తిగా ఇరుజట్ల బౌలర్ల హవా కనిపించింది. మొదటి రోజే రెండు జట్లు ఆలౌట్ కావడం విశేషం. మొదటి రోజు ముగిసే సరికి రెండు జట్లు కలిసి మొత్తం 20 వికెట్లు కోల్పోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152…
Virat Kohli: ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా నేడు (డిసెంబర్ 26) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్–1లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ 77 పరుగులు చేసి మరోసారి అభిమానులకు తన క్లాస్ ఇన్నింగ్స్ ను రుచి చూపించాడు. ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో…