ఎన్నికల వేళ తరచూ వినబడే పదాల్లో డిపాజిట్ పదం ఒకటి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో డిపాజిట్ కూడా రాదని తరచూ అంటుంటారు. అసలు డిపాజిట్ అంటే..
Congress vs Left: కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్‌గా మారింది రాజకీయం. నిజానికి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
CM Vijayan: ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సీపీఎం, మిత్ర పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడుతోంది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగానే ఉన్నా, కేరళలోకి వచ్చే రెండు పార్టీల మధ్య మాత్రం విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికల వేళ మిత్ర పక్షాలైన సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. ఈ మేరకు శనివారం డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సీపీఐ కార్యాలయాని వెళ్లారు. ఆయన కార్యాలయానికి రావడం సంతోషదాయకమని సీపీఎం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో సపోర్ట్ చేయాలని భట్టీ కోరినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.
CPM manifesto: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఎం పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ) చట్టం(UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) వంటి కఠినమైన చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.