సింగరేణి బొగ్గు క్షేత్రాల వేలానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద వామపక్షాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి . సిపిఐ, సిపిఐ (ఎం), సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు నిరసనలో పాల్గొని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్దపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలను రామగుండం , ఎన్టీపీసీ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు . కరీంనగర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకుడు…
ఒకప్పుడు భారతదేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం మనుగడ కష్టతరంగా మారింది. సీట్లు తగ్గడం వల్ల జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు కూడా అప్రస్తుతం అవుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ లో చివరిదశ ఎన్నికల్లో హింస చెలరేగింది. శనివారం నదియాలో బీజేపీ కార్యకర్త కాల్చి చంపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే బీజేపీలో చేరిన హఫీజుల్ షేక్‌ను టీ స్టాల్ వద్ద ఓ వ్యక్తి కాల్చి చంపాడు. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించగా.. పరారీలో అతని కోసం వెతుకుతున్నారు. మృతుడు షేక్ పై దాడి చేసిన వారిలో ఇద్దరు నిందితులను గుర్తించారు. వారిద్దరిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయని పోలీసులు…
TS State Emblem: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తుంది. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర చిహ్నంలో రాజ చిహ్నాలు ఉండకూడదని ఆదేశించిన తర్వాత..
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల అక్రమాలను కమిషన్ పట్టించుకోవడం మానేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేయలేదన్నారు. ఎన్నికల సజావుగా జరగా పోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం... బీజేపీ అడ్డుపెట్టుకొన్న తెలుగుదేశం కారణంగానే ఓటరు హక్కుని హరించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది.. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో మినహా శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా, నాల్గో విడత ఎన్నికలకు గత నెల 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది.. ఇక, ప్రచారంతో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి.. చివరి రోజు కూడా ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు.. వైసీపీ, టీడీపీ, జనసేన చీఫ్‌లు ప్రచారంలో పాల్గొననున్నారు..
భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఊహలు గ్యాస్ బుడగ లాగా ఉన్నాయని.. ఎంతో ఎత్తుకు ఎగిరి గ్యాస్ బుడగ చివరకు పేలిపోతుందని సీపీఎం జాతీయ నేత బృంధాకారత్ అన్నారు. శ్రీకాకులంలో ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన మొదటి రెండు విడతల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పరిస్థితి గ్యాస్ బుడగ వలే ఉందన్నారు.
అస్పష్టమైన హామీలతో ప్రజల్ని మభ్యపెడుతున్న బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో అభివృద్ధి జాడ ఎక్కడ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, పోలవరం నిర్వాసితుల ప్రస్తావనే లేకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని ఆయన అన్నారు.