ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు గడిచినా విధానాలు మాత్రం మారలేదని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియాతో మాట్లాడిన శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రధానితో కుదుర్చుకున్న ఒప్పందాలనే కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చూస్తుందన్నారు. దానిలో భాగంగానే గతంలో స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని చెప్పిన నారా లోకేష్.. నేడు వాటిని బిగించాలని చెప్పటం సిగ్గుచేటని శ్రీనివాస రావు మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించింది.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారాం ఏచూరి మృతి వెనుక కుట్ర ఉంది అన్నారు.. ఆయన మృతి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు..
అత్యంత పెద్దదైన భారతదేశానికి ఒకేసారి ఎన్నిక ఎలా కుదురుతుందా అని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. ప్రజాస్వామ్యం ఉండకూడదని.. అధ్యక్ష తరహా పాలన కోసమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక.. దేశం ఐక్యంగా ఉండదు.. ఒకే దేశం ఒకే ఎన్నిక వాదన.. సీతారాం ఏచూరి మార్క్సిస్ట్ పార్టీని దేశంలో అభివృద్ధి చేసారు..
స్టీల్ ప్లాంట్‌న ను ఏదోరకంగా మూసేయడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన. కూటమి సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరించను అని చెప్తున్నాడు.. కానీ, ఇది మాటలకే పరిమితం, తప్ప చేతల్లో చూపించడం లేదని విమర్శించారు.. స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్లు GST చెల్లిస్తోంది.. ఇప్పుడు షరతులతో కూడి 500 కోట్లు ఇస్తామని చెప్పడం తెలుగు ప్రజలును అవమానించడమే…
ప్రముఖ రాజకీయ ఉద్దండుడు, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఏచూరికి మోడీ సంతాపం వ్యక్తం చేశారు.
Sitaram Yechury: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పరిస్థితి విషమంగా ఉంది. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో సహా పలు అనారోగ్య సమస్యలో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు.
రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు.
ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిది.. ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ…