ఉల్లి రైతుకు మేలు చేయకపోతే రాజీనామా చేయండి అంటూ డిమాండ్ చేశారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించింది సీపీఎం నేతల బృందం.. ఉల్లి రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు నేతలు.. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉల్లి రైతులు దయనీయ స్థితిలో వున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.
స్టీల్ ప్లాంట్‌పై అబద్దాలు చెబుతున్నారు.. కానీ, దొడ్డిదారిన కేంద్ర ప్రభుత్వమే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తోందని మండిపడ్డారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాసింది సీపీఐ(ఎం).. కేంద్రం నుంచి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1,121 కోట్లు వెంటనే పంచాయితీలకు విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని పవన్ కల్యాణ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు..
Bombay High Court: పాలస్తీనా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరసనకు అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. జస్టిస్ రవీంద్ర ఘుగే, గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఒకప్పుడు కామ్రేడ్స్ అంటే.. నిత్యం ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలతో బిజీ బిజీగా ఉండేవారు. కానీ...మారుతున్న పరిస్థితుల్లో వాళ్ళ ఉద్యమాల తీరు కూడా మారిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
యోగా అందరికీ నేర్పించాలా?.. అంతలా నిధులు ఖర్చుపెట్టాలా? అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ లాగా రాష్ట్రంలో పాలన కనిపిస్తోందని విమర్శించారు. పోలవరం, అమరావతి అలాగే ఉన్నాయని.. కొత్తగా బనకచర్ల వచ్చిందని విమర్శించారు. సంపద సృష్టిలో ఏదైనా ప్రత్యేక ముద్ర వేయాలి కానీ.. కొత్తగా ఏం చేయక్కర్లేదని సూచించారు. మహిళలకు ఉచిత బస్సును తాము స్వాగతిస్తాం అని బీవీ రాఘవులు తెలిపారు. అంతర్జాతీయ యోగా…
గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి.
MA Baby: సీపీఎం పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఎంఏ బేబీని ఎన్నుకున్నారు. 71 ఏళ్ల బేబీ సీపీఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు. తమిళనాడు మధురైలో జరిగిన సీపీఎం 24వ పార్టీ కాంగ్రెస్‌లో ఎంఏ బేబీని పార్టీ చీఫ్‌గా ఎన్నుకున్నారు. కేరళ నుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా ఈయన నిలిచారు.
BV Raghavulu : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు పోటీ పడుతున్నారు. సీపీఎం అఖిల భారత జాతీయ మహా సభలు ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు తమిళనాడులోని మధురైలో జరగబోతున్నాయి. 3వ తేదీన ఫెడరలిజం ఈజ్ ధి స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా అనే సెమినార్ నిర్వహిస్తారు. 6వ తేదీన రెడ్ ఫ్లాగ్ ప్రాసెషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజే కొత్త జాతీయ కమిటీని కూడా…