ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో సీట్ల పంపకంతో పాటు ఉమ్మడి మేనిఫేస్టోపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తామన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని…
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల మనుగడ కష్టమేనని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. 370 సీట్లు గెలుస్తాం అని బీజేపీ స్పష్టంగా చెప్తోంది... జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ కాబట్టి బీజేపీ అలా అంటుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్ను విభజించి ముక్కలు చేశామని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది.. లౌకికవాదం, ప్రజాస్వామ్యం, విదేశీ సంస్థలకు దేశాన్ని అమ్మడం గొప్ప విజయంగా బీజేపీ భావిస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఖూనీ చెయ్యడం కూడా గొప్ప…
విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ…