Congress vs Left: రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress vs Left: కేరళలో కాంగ్రెస్ వర్సెస్ లెఫ్ట్‌గా మారింది రాజకీయం. నిజానికి ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నప్పటికీ, కేరళలో మాత్రం ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ విమర్శలకు ప్రతిగా వామపక్ష మద్దతు ఉన్న స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్, రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్‌ని కేంద్ర సంస్థలు ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై అన్వర్ మాట్లాడుతూ.. అతను ‘‘తక్కువ స్థాయి పౌరుడు’’ అని ఆరోపించడమే కాకుండా, రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయాలని డిమాండ్ చేయడం వివాదానికి దారి తీసింది.
మంగళవారం పాలక్కాడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో నిలంబూర్ ఎమ్మెల్యే అన్వర్ మాట్లాడుతూ..‘‘నేను రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ పరిధిలో భాగం, ఆయన్ను గాంధీ ఇంటిపేరుతో పిలువలేను. అతను తక్కువస్థాయికి పౌరుడిగా మారిపోయాడు. గాంధీ ఇంటిపేరులో పిలవడానికి అర్హత లేని వ్యక్తి. భారతదేశ ప్రజలు కూడా గత రెండు రోజులుగా ఇదే చెబుతున్నారు’’ అని అన్నారు.
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
Read Also: Rahul gandhi: అమేథీలో రాహుల్ ఇల్లు క్లీనింగ్.. ఏం జరుగుతోంది!
సీఎం పినరయి విజయన్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడంపై అన్వర్ మండిపడ్డారు. ‘‘నెహ్రూ కుటుంబంలో ఇలాంటి సభ్యులు ఉంటారా..? దానిపై నాకు అనుమానాలు ఉణ్నాయి. రాహుల్ గాంధీ డీఎన్ఏ పరీక్షించాలని నా అభిప్రాయం. రాహుల్‌కి జవహర్ లాల్ నెహ్రూ మనవడిగా ఎదగడానికి హక్కు లేదు. ఆయన ప్రధాని మోడీకి ఏజెంటా..? అని మనం ఆలోచించాల్సి ఉంది’’ అని అన్వర్ వ్యాఖ్యలు చేశారు.
అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షుడు ఎంఎం హసన్ తెలిపారు. నెహ్రూ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని నీచమైన పదజాలంతో దూషించిన అన్వర్‌పై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని హసన్ డిమాండ్ చేశారు. గాడ్సే కొత్త అవతారం పీవీ అన్వర్ అని.. గాంధీజీని చంపిన గాడ్సే తూటాల కంటే అన్వర్ మాటలు ప్రమాదకరమని, ఒక ప్రజాప్రతినిధి నుంచి రాకూడదని విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని హసన్ అన్నారు. పీవీ అన్వర్ సీఎం ఆత్మాహుతి దళంలో పనిచేస్తున్నాడని మండిపడ్డారు.
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!