దేశ వ్యాప్తంగా కమ్యునిస్ట్ పార్టీలకు అడ్రస్ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. గురువారం ఆయన ఏపీ శ్రీకాకుళంలో జిల్లాలో పర్యటించారు. CPI, CPM లను ప్రజలు మర్చిపోయారన్నారు. కమ్యునిస్ట్‌లు బీజేపీపై ఏడుస్తూ లబ్దిపోందాలని చూస్తున్నారని, ఇండియా అలయన్స్ కూటమి పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఇండియాలో పార్టీలు ఓకరినోకరు తిట్టుకుంటూ విడి పోతున్నారని, కమ్యునిస్ట్‌ల వల్ల స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నష్టపోయారన్నారు. స్టీల్ ప్లాంట్ ద్రోహులు కాంగ్రేస్, కమ్యునిస్ట్‌లని, UPA 1 కమ్యునిలుగా ఉన్నారని..…
దిశ రాష్ట్ర స్ధాయి కమిటీ సమావేశం ఇవాళ జరిగిందని.. మొదటిగా ఈ సమావేశం చాలా ఆలస్యంగా జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఉచిత బియ్యం పక్కదారి పడుతోంది అని కూడా సమావేశంలో మాట్లాడానని ఆయన తెలిపారు. ఈ కమిటీలో కేంద్ర పధకాల అమలు గురించి చర్చించామన్నారు. ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందన్నారు.
మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
పదేళ్ళలో ఏపీకి ఏమీ జరగలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. విజయవాడలోని యం.బి స్టేడియంలో జరిగిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన ప్రసంగించారు. విభజన చట్టంపై రాజ్యసభలో చాలా చర్చలు జరిగాయని.. ఆలోచన లేకుండా విభజన చేస్తున్నారు అని తెలిపారు.
ఈనెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరీ నిర్వహిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. వేలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభలో ప్రభుత్వాల విధానాలను ప్రశ్నిస్తామన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లను బీజేపీ, వైసీపీలు తమ ప్రచార కర్తలుగా మార్చుకుంటున్నారన్నారు.