PM Modi: హర్యానా హిస్సార్‌లో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డు చట్టాలను మార్చిందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ బోర్డు రూల్స్‌ని కాంగ్రెస్ మార్చిందని అన్నారు. కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్ పట్టుకుందని విమర్శించారు.
Waqf Act: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై పలు రాష్ట్రాల్లో ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. బెంగాల్లో ఏకంగా ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ముగ్గురు చనిపోయారు. ఆందోళనల్లో పాల్గొన్న 150కి పైగా వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తమ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేది లేదని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Bhu Bharati Portal: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి (ఏప్రిల్ 14న) నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
తాను మంత్రి పదవి కోసం ఢిల్లీలో పైరవీలు చేయనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఖమ్మంలో 9 మంది గేలిస్తే 3 మంత్రి పదవులు వచ్చాయని తెలిపారు. మరి నల్లగొండలో 11 స్థానాలు గెలుస్తే మంత్రి పదవులు రెండేనా? అన్నారు.
BJP: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. మోడీని ‘‘సంఘీ’’ అంటూనే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉగ్రవాదులు అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీజేపీకి చెందిన డానిష్ ఇక్బాల్ కన్హయ్య కుమార్‌పై ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. బీజేపీ ఆదివారం అతడిపై పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు (కేటీఆర్) మరోసారి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ వేదికగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్న తీరును తీవ్రంగా ఎత్తిచూపారు. కేటీఆర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రావడం లేదు. ఇదే వారికి ప్రజల నుంచి వచ్చిన అసలైన తీర్పు,” అని పేర్కొన్నారు. జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్…
అరెస్ట్ ఖాయమని ఆయన భావించారు. పార్టీ నేతలు జైలుకెళ్లడం గ్యారెంటీ అనుకున్నారు. ఆ నేత కూడా అదిగో అరెస్టు…ఇదిగో అరెస్టు అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన అరెస్టును అధికార పార్టీలో అడ్డుకుంటున్నదెవరు ? ప్రభుత్వం సైలెంట్ అవడానికి కారణాలేంటి ? ఎవరు బ్రేకులు వేస్తున్నారు ? తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి ? తెలంగాణ రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఫార్ములా-ఈ రేసింగ్ కేసులో ఒకసారి విచారణకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..,తనని అరెస్టు…
KTR : 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, రాష్ట్రం రూపుదిద్దుకునే దశలో పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అరవై లక్షల సభ్యులను కలిగి ఉందన్నారు. “రజతోత్సవం ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించే సభ కాదు,…
Congress: వరస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ పార్టీ, గత వైభవాన్ని తిరిగి సాధించేందుకు పార్టీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ‘‘సంఘటన్ సుజన్ అభియాన్’’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముందుగా, గుజరాత్లో దీనిని పైలట్ ప్రోగ్రామ్‌గా ప్రారంభించింది.