ICC T20 World Cup: వామ్మో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇంత మంది చూశారా! షాకింగ్ రిపోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 World Cup: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యంత చర్చనీయాంశమైన అంశం భారత్-పాకిస్థాన్ మ్యాచ్. మ్యాచ్ జరగడానికి ముందు అనేక రాజకీయ పరిణామాలు, బహిష్కరణ బెదిరింపులు చోటుచేసుకున్నాయి. కానీ, చివరకు మ్యాచ్ మొదలయ్యాక మైదానంలో పరుగుల వరదతో పాటు.. అటు ఇంటర్నెట్‌లో రికార్డుల వరద పారింది. నిజానికి దాయాదుల మధ్య జరిగిన ఈ పోరు కాసుల వర్షం కురిపించింది. ఈ మ్యాచ్ ద్వారా ఎన్ని వేల కోట్ల ఆదాయమో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ ఈ ఒక్క మ్యాచ్ ద్వారా ఎన్ని వేల కోట్ల ఆదాయం వచ్చిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కొన్ని షరతులు పెట్టింది. ఒక దశలో పాక్ జట్టు అసలు ఆడదేమో అనిపించింది. కానీ, ఐసీసీ (ICC) జోక్యంతో ఉత్కంఠ వీడి, కొలంబో వేదికగా దాయాదుల మధ్య పోరు మొదలైంది. ఈ టెన్షన్ వల్లే మ్యాచ్‌పై జనాల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. భారతదేశంలో అధికారిక స్ట్రీమింగ్ భాగస్వామి అయిన జియోహాట్‌స్టార్ ద్వారా ఈ మ్యాచ్ కళ్లు చెదిరే గణాంకాలను నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ను డిజిటల్‌లో ఏకంగా 16.3 కోట్ల మంది వీక్షించారు. ఇది ఏ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌కైనా ఒక రికార్డ్ అని జియోహాట్‌స్టార్ వెల్లడించింది. 2024లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ కంటే ఈసారి 56% ఎక్కువ మంది వీక్షించారు. ప్రజలు ఈ మ్యాచ్‌ను అన్ని రకాల స్క్రీన్లలో (మొబైల్, టీవీ) కలిపి మొత్తం 20 బిలియన్ నిమిషాల పాటు చూశారు. అంటే మునుపటి కంటే ఇది 42% ఎక్కువ. ఈ మ్యాచ్‌ను కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాదు, టీవీల్లో కూడా కోట్ల మంది చూశారు. దీంతో టీవీలో ఈ మ్యాచ్‌కు 71% రేటింగ్ పెరిగింది. 2021 తర్వాత అత్యధిక రేటింగ్ వచ్చిన మ్యాచ్ ఇదేనంట.
ఈ ఉత్కంఠభరిత పోరులో భారత్ 61 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. దీనితో టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 8-1కి చేరుకుంది. అంటే ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌ల్లో భారత్ 8 సార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా జియోస్టార్ ప్రతినిధులు సిద్ధార్థ్ శర్మ, అనుప్ గోవిందన్ మాట్లాడుతూ.. “ఈ మ్యాచ్ కోసం జరిగిన హంగామా, చివరకు ఆడిన తీరు అభిమానులను కట్టిపడేశాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ పట్ల ఉన్న మక్కువకు ఈ రికార్డులే నిదర్శనం” అని పేర్కొన్నారు.
READ ALSO: DGCA New Rules: ఇకపై విమానంలో ‘వీరంగాలు’ చెల్లవ్.. బాసు కొత్త రూల్స్ తెలుసా!
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!