తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వేదికపై ఓ ముస్లిం వైద్యురాలి హిజాబ్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో విపక్షాలు, నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. ఈ వ్యవహారం రాజకీయంగా చాలా దుమారమే చెలరేగింది.
పార్టీ మారినట్లుగా వస్తున్న వార్తలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండించారు. పార్టీ ఫిరాయింపుపై స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు లిఖితపూర్వంగా వివరణ ఇచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జర్మనీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మ్యూనిచ్‌లోని బీఎండబ్ల్యూ ప్లాంట్‌ను రాహుల్ గాంధీ సందర్శించారు. BMW వెల్ట్, BMW ప్లాంట్‌ను గైడెడ్ టూర్లో సందర్శించారు. కార్లు తయారీ, బైకుల తయారీని పరిశీలించారు.
బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడం బీఆర్ఎస్కు అలవాటైపోయిందన్నారు.
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ వ్యవహార శైలి మరోసారి వివాదాస్పదమైంది. కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ… ఆ ఎమ్మెల్యేలు మాత్రం సొంతూళ్ళనే ప్రత్యర్థులకు సమర్పించుకున్నారు. ఒకాయన అయితే… స్వగ్రామంలో సోదరుడిని కూడా గెలిపించుకోలేకపోయారు. అంత దారుణమైన ఫలితాన్ని చవిచూసిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ఎందుకలా జరిగింది? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపాయి. ఈ ఫలితాలు చూస్తుంటే… గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీ పట్టు తగ్గలేదన్న సంగతి అర్ధమవుతోందని అంటున్నారు హస్తం లీడర్స్. అదంతా ఒక ఎత్తయితే… అదే పార్టీకి చెందిన…
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది.