Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!
- ఇఫ్తార్ విందుకు క్లాసిక్ రంజాన్ వంటకాలు
- బిర్యానీ నుంచి కబాబ్స్ వరకు స్పెషల్ మెనూ
- శక్తినిచ్చే నిహారీ, చల్లనైన ఫలూదా ప్రత్యేకత
- రంజాన్ ఆధ్యాత్మికతలో రుచుల సంబరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramzan 2026 recipes : పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన వంటకాల కలయికకు ప్రతీక. తెల్లవారుజామున తీసుకునే ‘సెహ్రీ’ నుంచి సూర్యాస్తమయం తర్వాత ఉపవాసాన్ని విరమించే ‘ఇఫ్తార్’ వరకు ప్రతి ముస్లిం కుటుంబంలోనూ సంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేస్తారు. ఈ ఏడాది (2026) ఫిబ్రవరి 19న రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కాగా, ఇఫ్తార్ విందును మరింత రుచికరంగా మార్చే కొన్ని క్లాసిక్ వంటకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Also Read
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ
రంజాన్ ఇఫ్తార్ టేబుల్‌పై చికెన్ బిర్యానీ లేకపోతే ఆ విందే వెలవెలబోతుంది. సుగంధ ద్రవ్యాలు, కేసరి, పుదీనా రెమ్మలతో ఉడికించిన సువాసనభరితమైన ఈ అన్నం ఇఫ్తార్‌లో ప్రధాన వంటకం. ఇది కడుపునింపడమే కాకుండా పండగ వాతావరణాన్ని నింపుతుంది. ముఖ్యంగా మన హైదరాబాదీ దమ్ బిర్యానీకి ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తమైంది.

నోట్లో వేస్తే కరిగిపోయే మలై కబాబ్స్
ఉపవాసం విరమించిన తర్వాత మెత్తని, క్రీమీగా ఉండే చికెన్ మలై కబాబ్స్‌తో భోజనాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. పెరుగు, మీగడ , తక్కువ మసాలాలతో తయారుచేసే ఈ కబాబ్స్ తేలికగా ఉండి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇవి ఇఫ్తార్ విందులో ఉత్తమమైన స్టార్టర్స్‌గా నిలుస్తాయి.

స్మోకీ ఫ్లేవర్ తో సీక్ కబాబ్స్
సన్నగా తరిగిన మాంసం (మటన్ లేదా చికెన్), మసాలాల మిశ్రమాన్ని సీకులకు గుచ్చి గ్రిల్ చేయడం ద్వారా వచ్చే ఆ స్మోకీ ఫ్లేవర్ రంజాన్ విందులో ప్రత్యేక ఆకర్షణ. దీనిని పుదీనా చట్నీ , ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే ఆ రుచే వేరు. మాంసాహార ప్రియులకు ఇది ఎప్పుడూ మొదటి ఛాయిస్.

ముప్పై ఆరు మసాలాల నిహారీ
సంప్రదాయబద్ధంగా నిహారీని ఉదయం పూట తిన్నప్పటికీ, ఇఫ్తార్ సమయంలో కూడా దీనికి భలే గిరాకీ ఉంటుంది. మాంసం ముక్కలను చిక్కటి గ్రేవీలో గంటల తరబడి ఉడికించి చేసే ఈ వంటకం చాలా శక్తినిస్తుంది. వేడి వేడి కుల్చా లేదా నాన్‌తో కలిపి దీనిని ఆస్వాదిస్తారు.

చల్లనైన ఫలూదా డ్రింక్
రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత శరీరాన్ని చల్లబరిచేందుకు ‘ఫలూదా’ ఉత్తమమైన పానీయం. పాలు, రోజ్ సిరప్, సబ్జా గింజలు, సేమియా , ఐస్‌క్రీమ్‌లతో తయారయ్యే ఈ డ్రింక్ రంజాన్ విందును తియ్యని ముగింపుతో ముగిస్తుంది. ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా వెంటనే ఉత్సాహాన్ని ఇస్తుంది.
రంజాన్ అంటే కేవలం భోజనం మాత్రమే కాదు, పేదలకు ‘జకాత్’ ఇవ్వడం , కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేయడం కూడా ఒక భాగం. ఈ రుచికరమైన వంటకాలతో ఈ రంజాన్ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా జరుపుకోండి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!